బెల్లంకొండ శ్రీనివాస్‌ కొత్త చిత్రం గ్రాండ్ లాంచ్‌..

603
Bellamkonda Sai Srinivas
- Advertisement -

`రాక్ష‌సుడు`తో సూప‌ర్ హిట్ అందుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కందిరీగ‌, ర‌భ‌స, హైప‌ర్‌ చిత్రాల ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో సినిమా రూపొంద‌నుంది. ఈ రోజు హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈసినిమా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. వివి వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా, జెమినీ కిర‌ణ్ కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్‌ని దిల్ రాజు డైరెక్ట్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలుకానుంది.

hero sai srinivas

సుమంత్ మూవీస్ పతాకంపై జి.సుబ్రహ్మణ్యం నిర్మించనున్నారు. ఈ సినిమా కోసం వినూత్నమైన స్క్రిప్ట్ సిద్ధమైంది. హీరో శ్రీనివాస్ యైట్‌ప్యాక్‌తో కనిపించబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తారు. ఇస్మార్ట్ బ్యూటీ న‌భా న‌టేష్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ 8ప్యాక్స్‌తో లుక్‌లో క‌న‌ప‌డబోతున్నారు.

nabha natesh

- Advertisement -