పాలు తాగడం మానండి…బాధ్యతగా బీరు తాగండి..!

341
onlinews portal
- Advertisement -

వాతావరణం హాట్ హాట్‌గా ఉన్నప్పుడు ఒక చ‌ల్ల‌ని బీర్ కొడితే ఎలా ఉంటుంది? ఆ మ‌జాయే వేరు క‌దా! బీర్ తాగడం అనేది ఇప్పుడు చాలా మాములు విషయం అయిపోయింది, ఒకప్పుడు మందు తాగాలంటే అది చాలా పెద్ద తప్పుగా భావించేవారు. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ కలిసిన, క్రికెట్ మ్యాచ్ ఉన్న, పండగలకి చుట్టాలు వచ్చిన, వీకెండ్ అయిన ఖచ్చితంగా బీరు పొంగాల్సిందే అన్నట్టుగా మారిపోయింది కాలం.మితంగా బీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని ఓ సర్వేలో తేలింది.

online news portal

పాల కంటే బీరు తాగడమే ఆరోగ్యానికి మంచిదని జంతు పరిరక్షణ కోసం పాటుపడుతున్న ‘పెటా'((పీపుల్ ఆఫ్ ది ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ ఎనిమల్) ఈ ప్రకటన చేసింది. అంతేకాదు ఈ విషయం శాస్త్రీయంగా రుజువైందని కూడా వెల్లడించింది. పాలతో పోలిస్తే బీరు బలవర్ధక ఆహారమని వివరించింది. రెండింటిలోనూ పోషకాలను పోల్చిచూపింది. ఎముకల పటుత్వాన్ని పెంచి ఆయుర్ధాయం పెంచుతుందని తెలిపింది.అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ-మాడిసన్ క్యాంపస్ కు కూటవేటు దూరంలో హిల్ డేల్ మాల్ వద్ద ‘గాట్ బీర్’ పేరుతో బిల్ బోర్డును పెటా ఏర్పాటు చేసింది. పాలు తాగడం కంటే బీరు సేవించడం ఆరోగ్యానికి మంచిదని అధికారికంగా నిర్ధారణయిందని అందులో పేర్కొంది.

brand_headers_milk

ఆల్కహాల్ మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనని పెటా కార్యవర్గ ఉపాధ్యక్షుడు ట్రేసీ రీమాన్ తెలిపారు. ఆరోగ్యం కోసం పాల ఉత్పత్తులనే వినియోగించాల్సిన అవసరం లేదన్నారు. పాలు తాగడం వల్ల ఒబిసిటీ, డయాబెటీస్, కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది. పాల ఉత్పత్తులు వాడడం వల్ల ఎముకలు గుల్లబారే ప్రమాముందని హెచ్చరించింది. ‘పాలు తాగడం మానండి, బాధ్యతగా బీరు తాగండి’ అని ప్రకటనలో పేర్కొంది. గతంలోనూ బీరుకు మద్దతుగా పెటా ప్రచారం చేసింది. 2000 సంవత్సరంలో బీరుకు మద్దతుగా పెటా ప్రచారం చేసింది. అయితే పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో అప్పట్లో పెటా వెనక్కు తగ్గింది.

హార్వ‌ర్డ్ స్కూల్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ వారు చేసిన పరిశోధనల ప్రకారం, బీరులో పాలీఫినాల్స్ అన‌బ‌డే ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతాయి.బీర్‌ను త‌గిన మోతాదులో సేవిస్తే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గ‌డంతోపాటు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.బీరు రక్త నాళాలని గట్టి పడకుండా చూసి, ర‌క్తం గడ్డ‌క‌ట్ట‌కుండా కాపాడుతుంది,దీని వ‌ల్ల హార్ట్ ఎటాక్స్ వంటివి వ‌చ్చేందుకు అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది.

బీర్‌ను త‌ర‌చూ తాగడం వల్ల కిడ్నీల‌లో రాళ్లు ఏర్ప‌డే అవ‌కాశం కూడా త‌గ్గుతుంద‌ట‌. ఫిన్‌లాండ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు చేసిన ప్ర‌యోగాల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది. అంతేకాకుండా శ‌రీరంలోని విష ప‌దార్థాలు కూడా బ‌య‌టికి వెళ్లిపోతాయ‌ట‌. ప్ర‌ధానంగా కాల్షియం పేరుకుపోవ‌డం వ‌ల్ల ఏర్ప‌డే కిడ్నీ రాళ్ల‌ను అడ్డుకోవ‌డంలో బీర్ ముఖ్య పాత్ర పోషిస్తుంద‌ట‌.

online news portal

బర్ల‌లో సిలికాన్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఇది ఎముక‌ల పోష‌ణకు ఎంత‌గానో అవ‌స‌ర‌మ‌వుతుంద‌ట‌. కాబ‌ట్టి బీర్‌ను తాగితే అందులోని సిలికాన్ వ‌ల్ల ఎముక‌ల‌కు బ‌లం చేకూరుతుంది. 2009లో టఫ్ట్స్ యూనివ‌ర్సిటీ చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం తెలిసింది.

అయితే,ఏదైనా సరే మోతాదుగా తీసుకుంటే ఎటువంటి అనర్దాలు ఉండవు, మోతాదు మించితేనే అనారోగ్యం పాలు కావాల్సివస్తుంది, కాని బీరుని మితంగా తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది,ఆరోగ్యంగా ఉన్న మ‌గ లేదా ఆడ మ‌నిషి రోజుకు 12 ఔన్సుల (దాదాపు 350 ఎంఎల్‌) మోతాదులో బీర్ తాగితే దాంతో ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ట‌. ఎన్ని బెనిఫిట్స్ ఉన్న తక్కువ మోతాదులో తాగితేనే అవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

- Advertisement -