నవంబర్ 22న “బీచ్ రోడ్ చేతన్”

198
Beach Road Chetan

రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు, చిత్రాల్లో నటించిన చేతన్ మద్దినేని తొలిసారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ర అండ్ రియలిస్టిక్ రస్టిక్ ఫిలిం “బీచ్ రోడ్ చేతన్”. చేతన్ మద్దినేని ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ను నవంబర్ 16న విడుదల చేసారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శక-నిర్మాత-హీరో చేతన్ మద్దినేని తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చేతన్ మాట్లాడుతూ…నవంబర్ 22న మా బీచ్ రోడ్ చేతన్ విడుదల కాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్స్ ఏపీ, తెలంగాణలో ఉచితంగా ఇస్తున్నాము. దాదాపు 200 థియేటర్స్ లో మా సినిమా విడుదల కాబోతోంది. ఫస్ట్ డే మార్నింగ్ షో నుండి మా సినిమాకు పాజిటీవ్ టాక్ వస్తుందని భావిస్తున్నాను. ఒక ప్రయోగాత్మకమైన సినిమాతో మీ ముందుకు వస్తున్నాము, టీజర్ అందరికి నచ్చింది, ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది అన్నారు. 22న రాబోతున్న మా సినిమా మీకు నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.