సెలెక్టర్ల కోసం బీసీసీఐ ప్రకటన..

668
bcci
- Advertisement -

చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలెక్టర్ గగన్ ఖోడాల పదవీకాలం ముగియడంతో కొత్త సెలెక్టర్ల కోసం బీసీసీఐ ప్రకటన ఇచ్చింది. సెలెక్టర్ పదవి కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నియమావళి కూడా ప్రకటించారు. అలాగే, మహిళా సెలక్షన్ కమిటీ మొత్తానికి దరఖాస్తులు కోరగా, జూనియర్ జట్టు కమిటీలో రెండు పోస్టులకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తూ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులు పంపుకోవడానికి ఆఖరు తేదీ జనవరి 24. కాగా కొత్త సెలెక్టర్లను ఎంపిక చేయడానికి క్రికెట్ సలహా సంఘం ఏర్పడాల్సి ఉంది.

అర్హతలు.. సీనియర్ సెలెక్షన్ కమిటీ సభ్యుల వయసు 60 ఏళ్ల లోపు ఉండాలి. కెరీర్ లో కనీసం 7 టెస్టులు కానీ, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు కానీ ఆడిన అనుభవం ఉండాలి. లేదా, 10 వన్డేలు కానీ, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు కానీ ఆడిన అనుభవం ఉండాలి. ఐదేళ్ల కిందట, లేదా అంతకుముందే క్రికెట్ కు గుడ్ బై చెప్పినవాళ్లే అర్హులు. సీనియర్ మహిళా జట్టుకు దరఖాస్తు చేసుకునే వారికి భారత్ తరపున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ అయినా ఆడిన అనుభవం ఉండాలి.

- Advertisement -