యువీకి బీసీసీఐ గుడ్ న్యూస్‌..!

323
yuvraj singh
- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్ సింగ్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యువీకి పలువురు సెలబ్రెటీలు ఘనంగా వీడ్కోలు చెబుతు బెస్ట్ విషెస్ చెప్పారు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినా విదేశీ లీగుల్లో ఆడేందుకు యవరాజ్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

యువరాజ్ కోరితే అనుమతిచ్చేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. యువరాజ్ ఇంకా బోర్డును అనుమతి కోరుతూ లేఖ రాయలేదని ఒకవేళ లేఖ అందితే అందిన వెంటనే దానిని పరిశీలిస్తామన్నారు బీసీసీఐ అధికారులు.

టీమిండియా తరఫున 2000లో కెన్యాపై అరంగేట్రం చేసిన సీనియర్‌ క్రికెటర్‌ 2017లో వెస్టిండీస్‌పై ఆఖరి వన్డే ఆడాడు. ప్రపంచవ్యాప్తంగా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 22వ స్థానంలో ఉన్న యువీ టీమిండియా తరఫున ఏడో ఆటగాడిగా నిలిచాడు. భారత్ రెండోసారి ప్రపంచకప్ గెలవడంలో కీ రోల్ పోషించాడు యువీ.

- Advertisement -