పీఎం సహాయనిధికి బీసీసీఐ రూ.51 కోట్ల విరాళం…

328
bcci
- Advertisement -

కరోనా మహమ్మారిపై పోరాడేందుకు క్రీడా లోకం తరలివస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా వెలుగొందుతున్న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)..కరోనా వైరస్‌పై పోరుకు భారీ విరాళం ప్రకటించింది. ప్రధానమంత్రి రిలీఫ్‌ ఫండ్‌కు రూ.51 కోట్లు విరాళమిస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది.

సచిన్ టెండూల్కర్‌ రూ. 50 లక్షలు ఇవ్వగా సురేశ్‌ రైనా శనివారం రూ.52 లక్షలు విరాళమిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇందులో ప్రధానమంత్రి రిలీఫ్‌ ఫండ్‌కు రూ.31 లక్షలు, యూపీ సీఎం సహాయక నిధికి రూ.21 లక్షలు ఇస్తున్నట్లు తెలిపాడు. షట్లర్‌ పీవీ సింధు రూ.10 లక్షలు విరాళం ఇవ్వగా ధోని ఓ ఎన్జీవోతో కలిసి లక్ష రూపాయలు విరాళం ఇచ్చాడు.

వీరితో పాటు బీసీసీఐ చీఫ్ గంగూలీ, సాకర్‌ స్టార్స్‌ రొనాల్డో, మెస్సీ, సెర్బియా టెన్నిస్‌ యోధుడు జొకోవిచ్‌ తదితరులు భారీ విరాళాలతో మిగతా క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మెస్సీ.. 1 మిలియన్‌ యూరోస్‌(రూ.8.36 కోట్లు) ,రొనాల్డో కూడా రూ.8.36 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.

- Advertisement -