కోహ్లీ సేనకు బీసీసీఐ బోనస్‌

347
bcci
- Advertisement -

75 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఆసీస్‌ గడ్డపై తొలిసారి సిరీస్‌ గెలుచుకున్న కోహ్లీసేనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటా,బయట కోహ్లీ సేనపై అందరు ప్రశంసలు గుప్పిస్తున్నారు. భారత జట్టుకు పాకిస్థాన్ ప్రధాని, మాజీ ఆల్‌ రౌండర్‌ ఇమ్రాన్ ఖాన్ మంగళవారం అభినందనలు తెలియజేశారు. విరాట్ కోహ్లీ, భారత క్రికెట్ జట్టుకు అభినందనలు. ఉపఖండానికి చెందిన టెస్ట్ బృందాలకు ఆస్ట్రేలియాలో ఇదే తొలి విజయం అని ప్రశంసించారు.

ఇక కోహ్లీసేనకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. మ్యాచ్‌ ఫీజుకు సమానంగా బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీ ఇందుకు ఆమోదం తెలిపింది.

ఒక్కో మ్యాచ్‌కు ఫీజు రూ.15 లక్షల వరకు ఉంటుంది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన వారికి రూ.60 లక్షల వరకు బహుమానం
దక్కనుంది. రిజర్వు ఆటగాళ్లకు మ్యాచ్‌కు రూ.7.5 లక్షలు ఇస్తారు. కోచ్‌లకు తలో రూ.25 లక్షలు ఇవ్వనున్నారు.

- Advertisement -