జాగృతి అంటేనే బతుకమ్మ…

627
bathukamma kavitha
- Advertisement -

తెలంగాణ బతుకు పండుగ బతుకమ్మ. విరుల సౌరభంతో పుడమి తల్లి పులకించే ఈ వేడుక …ప్రకృతి పూల పరిమళంతో  వికసిస్తుంది. తంగేడు పరిమళం,గునుగులోని సోగసు,కట్లపూల సోయగం ఇలా 9 రోజుల పాటు మినీ కుంభమేళలా బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగుతాయి. ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు బతుకమ్మ ఉత్సవాలు అంగరంగవైభవంగా జరగనున్నాయి. అక్టోబర్ 6న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ ఉత్సవాలను వేలాది మంది మహిళలతో నిర్వహించనున్నారు.

Bathukamma Unique Festival Of Telangana
బతుకమ్మ అనగానే మనకు గుర్తుకువచ్చేది తెలంగాణ  జాగృతి.  సమైక్య రాష్ట్రంలో వివక్షకు గురవుతున్న మన సంస్కృతి సంప్రదాయాలను జాగృతం చేసేందుకు తెలంగాణ జాగృతిని స్ధాపించి గుర్తింపు కొల్పోతున్న బతుకమ్మ పండుగను తానే భుజానవేసుకుని ప్రపంచం గుర్తించి గౌరవించేలా చేసింది కవితక్క.

9 రోజుల పాటు  జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు తీరొక్క పూల రంగులతో తెలంగాణ మురిసిపోనుంది..! ఉయ్యాల పాటల రాగాలతో కోటి రతనాల వీణ పులకించనుంది. జాగృతి అంటేనే బతుకమ్మ అనేలా వాడవాడలా బతుకమ్మ విశిష్టను చాటిచెప్పింది.

జాగృతి ద్వారా మహిళలను ఉద్యమంలో భాగస్వాములను చేసిన కవితక్క….బంగారు తెలంగాణ పునర్ నిర్మాణంలో సైతం వారి పాత్రను ఉండేలా తనవంతు కృషిచేస్తోంది. ప్రతీ నియోజకవర్గం, ప్రతీ మండలం, ప్రతీ గ్రామంలో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది.

Bathukamma Unique Festival Of Telangana
తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నారైలు బతుకమ్మసంబరాల్లో పాల్గొని రాష్ట్రం విడిపోయిన ప్రజలంతా ఒక్కటేనని చాటారు. ఈ ఏడాది సైతం తెలంగాణ పూలవనంలా బతుకమ్మ సంబరాలతో మార్మోగిపోనుంది.

- Advertisement -