మంత్రి తలసానికి కృతజ్ఞతలు తెలిపిన బత్తిన సోదరులు..

43

రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య, సినీమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు బత్తిన హరినాధ్ గౌడ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి అన్ని విధాలుగా సహకరించిన మంత్రిని శాలువా, పూల బొకేతో సన్మానించారు.

ఇటీవల హైద్రాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప మందు పంపిణీ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఆధ్వర్యంలో అన్ని విధాల ఏర్పాట్లు చేసి బత్తిన హరినాధ్‌ సోదరులకు చేప మందు పంపిణీలో ఎంతో సహకరించారు. దీనికి గాను మంత్రి తలసానికి బత్తిని సోదరులు ధన్యవాదాలు తెలియజేశారు.

Minister Talasani

మృగ శిర కార్తె సందర్బంగా బత్తిని సోదరులు ఇచ్చే ఈ చేప ముందు కోసం ప్రతి ఏటా దేశ, రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆస్తమా రోగులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఈ చేప మందు పంపిణీ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 24 గంటల పాటు నిరంతరాయంగా విజయవంతంగా కొనసాగింది.