పౌరసత్వ బిల్లు.. బంగ్లా మంత్రి భారత్ పర్యటన రద్దు

453
bangladesh foriegn minister
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ బిల్లు 2019కు అమోదం తెలిపిన నేపథ్యంలో పొరుగుదేశం బంగ్లాదేశ్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. తన భారత పర్యటనను రద్దుచేసుకున్న బంగ్లా విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్ …తమ దేశంలో మైనార్టీల పట్ల ఎలాంటి వివక్ష చూపడం లేదన్నారు. ఈ బిల్లు వల్ల భారత లౌకిక వాదం బలహీనపడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్‌లో హిందువులను వేధిస్తున్నారన్న భారత హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను మొమెన్ ఖండించారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నిజం కాదన్నారు. షా కొన్నాళ్లు బంగ్లాదేశ్‌లో ఉంటే మా దగ్గరున్న మతసామరస్యాన్ని చూడొచ్చన్నారు. మా దేశంలో మైనార్టీలెవరూ లేరని అంతా సమానమే అన్నారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే రు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

పౌరసత్వ బిల్లు ప్రకారం 2014, డిసెంబర్ 31లోగా భారత్‌కు శరణార్థులుగా వచ్చిన పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్‌ దేశాలకు చెందిన హిందు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీ, క్రైస్తవులకు భారత పౌరసత్వం ఇస్తారు.

Citizenship Bill in the Rajya Sabha late Wednesday night …Bangladesh Foreign Minister Cancels India Visit Amid North East Violence

- Advertisement -