ఖాతా తెరిచిన బెంగుళూరు

32
Benguluru won

ఐపిఎల్ 12 సీజన్ లో వరుసగా 6మ్యాచ్ లలో ఓడిపోయి రికార్డు సృష్టించింది బెంగుళూరు టీం. తాజాగా నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది బెంగుళూరు. ఈసీజన్ ఐపిఎల్ లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. వరుసగా ఆరు మ్యాచ్ లు ఓడినా బెంగుళూరు…ఏడో మ్యాచ్ లో విజయం సాధించింది. 8వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ను ఓడించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగుళూరు నిర్ణిత 20ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173పరుగులు చేసింది.

ఓపెనర్ కేఎల్ రాహుల్ 18పరుగులు చేయగా..గేల్ 99 పరుగుల వద్ద నాటౌట్ గా నిలిచాడు. ఆ తర్వాత 174పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు 19.2ఓవర్లలో 2వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ పార్దివ్ పటేల్ 19పరుగులకు అవుట్ కాగా విరాట్ కోహ్లి 67పరుగులు చేశాడు. ఎబి డివిలియర్స్ 59పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. బెంగుళూరు విజయంలో కెప్టెన్ విరాట్ కోహ్లి, డివిలియర్స్ కీలక పాత్ర పోషించారు. ఏదిఏమైనా వరుసగా ఓడిపోతున్న బెంగుళూరుకు నిన్నటి మ్యాచ్ కొంచెం ఉపశమనం ఇచ్చిందనే చెప్పుకోవాలి.