మాటల్లేవ్…సీఎం కేసీఆర్‌పై బండ్ల ప్రశంసలు

383
bandla ganesh
- Advertisement -

సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు సినీ నటుడు బండ్ల గణేష్‌. చికెన్, గుడ్లు తినడం వల్ల కరోనా రాదని సీఎం కేసీఆర్ చెప్పిన వీడియోని షెర్ చేసిన బండ్ల…సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. మాటల్లేవ్….మాట్లాడుకోవడాల్లేవ్ పరమేశ్వర పౌల్ట్రి ఫామ్ బండ్ల గణేష్ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

దేశంలో కరోనా కేసులు నమోదవ్వడంతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. దీనికి కారణం చికెన్ తినడం వల్ల కరోనా వ్యాపిస్తుందని ముందు నుండి దుష్ప్రచారం జరగటమే. అది నమ్మిన ప్రజలు చికెన్ తినడం మొత్తానికే మానేశారు. దాంతో చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి.

కొన్ని ప్రాంతాల్లో ఫారం యజమానులు కోళ్లకు తిండి పెట్టలేక వాటిని బతికుండగానే పాతిపెట్టారు కూడా. ఇక మరి కొందరు యజమానులు కోళ్లను ఫ్రీగా పంచేశారు. ప్రజలకు దీనిపై అవేర్ నెస్ తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. తాజాగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో తిరిగి పౌల్ట్రి పరిశ్రమ పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.

- Advertisement -