హిమచల్ ప్రదేశ్ గవర్నర్ గా దత్తాత్రేయ

228
BandaruDattatraya.jpeg
- Advertisement -

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియామకం అయ్యారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న కలరాజ్ మిశ్రాను రాజస్థాన్‌కు బదిలీ చేశారు. ఇవాళ తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నూతన గవర్నర్లను నియమించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిర్ణయం తీసుకుంది . బండారు దత్తాత్రేయ రెండు సార్లు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. మొదటి పదవీకాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి (స్వతంత్ర ఛార్జ్).

వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర రైల్వే మంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన సేవలందించారు. నాలుగసార్లు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1980లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, 89లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 96 నుంచి 98 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. తొలిసారి 1991లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించారు. 1998, 99, 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచే గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. తొలుత ఇక్కడ నుంచి పోటీచేయాలని దత్తాత్రేయ భావించినా అధిష్ఠానం ఆయనకు నచ్చజెప్పి కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. ఎంపీ సీటు త్యాగం చేయడంతో గవర్నర్ పదవితో ఆయనను బీజేపీ సంతృప్తి పరిచింది. దత్తాత్రేయ వ్యక్తిగత జీవితానికి వస్తే 1947 ఫిబ్రవరి 26న ఆయన జన్మించారు. ఆయన 1965లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో(ఆర్ఎస్ఎస్ ) చేరారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంగా ఉన్న సమయంలో పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు. దత్తన్నకు గవర్నర్ పదవి రావడంతో తెలంగాణ బీజేపీ నేతలు ఆనందంగా ఉన్నారు.

- Advertisement -