మద్యం నివారణకు చైతన్యం తేవాలి: హరీష్‌

402
harish rao
- Advertisement -

గ్రామాల్లో మద్యం నివారణకు చైతన్యం తేవాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్ధిపేట ఎంపీడీవో కార్యాలయంలో మహిళ సమాఖ్య సభలో పాల్గొన్న హరీశ్ రావు మహిళా చైతన్యం గొప్పదన్నారు.

మహిళలు సమాజ మార్పునకు ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుంటే.. అభివృద్ధి ఎంతో దూరం ఉండదన్నారు. సేంద్రియ వ్యవసాయం పై అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు.

మొక్కలు పెంచడం.. ప్లాస్టిక్ ని నివారించేందుకు మహిళా సంఘాలు ప్రజల్లో మార్పు తేవాలన్నారు. మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలను ప్రోత్సాహిస్తామని.. మన ఇల్లు ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టూ ఉండే పరిసరాలను అలాగే శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ వైద్య పై మహిళల్లో అవగాహన కల్పించాలన్నారు.

- Advertisement -