కోహ్లీపై బ్రిటన్‌ పత్రిక ఆరోపణలు..

285
ball tampering allegations against Virat Kohli hold no basis
ball tampering allegations against Virat Kohli hold no basis
- Advertisement -

టీమిండియా టెస్టుజట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడ్డాడంటూబ్రిటీష్‌ పత్రిక ‘ది డైలీ మెయిల్‌’ ఆరోపణలు చేసింది. నవంబరు 9 నుంచి 13 వరకు రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్లు మంగళవారం ఓ కథనాన్ని ప్రచురించింది. దీనికి సంబంధించి వీడియో ఆధారాలు కూడా ఉన్నట్లు ఆ పత్రిక పేర్కొంది.

 kohli_pti-m4

తన నోట్లో ఉన్న తెల్లటి పదార్థాన్ని తీసి బంతికి అద్దుతూ దానికి మెరుపు తెచ్చేందుకు కోహ్లీ ప్రయత్నించాడని ఓ ఆధారాన్ని కూడా చూపింది. కోహ్లీ కుడి చేతిని నోట్లో పెట్టుకోవడం, దాంతో బంతిని రుద్దుతుండగా టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని తెలిపింది.అయితే ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం విరాట్‌పై వ‌చ్చిన ఆరోప‌ణలు ఇప్పుడు ఎలాంటి ప్ర‌భావం చూపే అవకాశం లేదు. ఎందుకంటే ఇంగ్లండ్ టీమ్ దీనిపై ఎలాంటి ఫిర్యాదు న‌మోదు చేయ‌లేదు. టాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆటగాళ్లు లేదా అంపైర్లు గుర్తించి నిబంధనల ప్రకారం ఐదు రోజులలోపు ఐసీసీకి ఫిర్యాదు చేయాలి. ఇదేమీ జరగలేదు.

daily mail

రాజ్‌కోట్ మ్యాచ్ న‌వంబ‌ర్ 13న ముగిసింది. అంటే న‌వంబ‌ర్ 18లోపే ఇంగ్లండ్ దీనిపై ఫిర్యాదు చేయాల్సింది. అలా జ‌ర‌గ‌క‌పోవడంతో కోహ్లిపై ఇప్పుడు ఐసీసీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకొనే అవ‌కాశం లేకుండాపోయింది. వైజాగ్‌లో ఇంగ్లండ్‌ ఓడిపోయిన తర్వాత తెల్లదొరల పత్రిక ఈ కథనం రాయడాన్ని చూస్తే అది కావాలనే విరాట్‌పై ఆరోపణలు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -