బాల్క సుమన్‌ ఆధ్వర్యంలో కాళేశ్వరం జలజాతర

444
suman
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు జలకళ సంతరించుకున్న నేపథ్యంలో చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కాళేశ్వరం జలజాతర నిర్వహించారు. అన్నారం బ్యారేజ్ వద్ద సామూహిక వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. జల జాతర సందర్భంగా గోదావరి తల్లికి పుష్పాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ,ఎమ్మెల్యేలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు,చెన్నూర్ నియోజకవర్గ ప్రాంతానికి చెందిన వేలాది మంది కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ,అన్నారం బ్యారేజ్‌లు జలభాండాగారాలను తలపిస్తున్నాయి. ప్రాణహిత నుంచి గోదావరిలోకి ఇన్‌ఫ్లో నిలకడగా వస్తుండటంతో నీటినిల్వ రోజురోజుకి పెరిగిపోతోంది. మేడిగడ్డ బరాజ్‌లో క్రమేణా నీటినిల్వ పెరుగుతూ 6.70 టీఎంసీలకు చేరగా అన్నారం బరాజ్‌లో నీటి నిల్వ 4.59 టీఎంసీలకు పెరిగింది. ఫలితంగా.. ఫ్లడ్ రివర్ లెవల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) 119 మీటర్లకుగాను సోమవారానికి నీటిమట్టం 115.60 మీటర్లకు చేరింది.

mla suman

కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఇలా ఎక్కడచూసినా అద్భుత జలదృశ్యాలు కనిపిస్తున్నాయి. గోదావరి నది కిలోమీటర్ల మేర నీటితో కళకళలాడుతున్నది. దిగువ నుంచి గోదారమ్మ ఎదురేగి వస్తు న్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నా యి. దీంతో పెద్ద ఎత్తున సందర్శకులు కాళేశ్వరం ప్రాజెక్టును చూసేందుకు తరలివస్తున్నారు.

kaleshwaram

- Advertisement -