బీజేపీలోకి తెలంగాణ కాంగ్రెస్‌ నేతల క్యూ..?

279
balaram naik

తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతునే ఉన్నాయి. ఓ వైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కంటిన్యూ అవుతుండగానే మరో ఇద్దరు సీనియర్లు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కేంద్ర మాజీ మంత్రులు,పార్టీ సీనియర్ నేతలు సర్వే సత్యనారాయణ,బలరాం నాయక్‌ పార్టీని వీడనున్నారు.

పీసీసీ చీఫ్ ఉత్తమ్‌పై అసంతృప్తితో ఉన్న వీరిద్దరు త్వరలో బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో సర్వే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండగా పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదంటూ బలరాం నాయక్ గత కొద్ది కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే వీరిద్దరూ కాంగ్రెస్‌కు హ్యాండ్‌ ఇచ్చి బీజేపీ గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అయితే కొద్దిరోజుల్లో కొత్త పీసీసీ అధ్యక్షుడు వస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి వలసలు ఆ పార్టీ నేతలకు నిద్రపట్టకుండా చేస్తోంది. వీలైనంత త్వరలో పీసీసీ చీఫ్‌ని నియమించి పార్టీ పూర్వవైభవం తేవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్న మరికొంతమంది నేతలు పార్టీ వీడేందుకు రెడీ అవుతుండటంతో పార్టీ భవిష్యత్‌ ఏంటో తెలియక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.