బాలకృష్ణ..నెక్ట్స్ మూవీ టైటిల్‌ ఇదే..!

159
balakrishna

బాలయ్య సినిమాలంటేనే పవర్ ఫుల్ మూవీ టైటిల్‌ ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్‌ తర్వాత రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీకి కూడా పవర్‌ ఫుల్ టైటిల్‌ని పరిశీలిస్తున్నారు.నరసింహనాయుడు,సింహా,లెజెండ్,లయన్‌ తరహాలోనే రూలర్ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ టైటిల్ విషయంలో బాలకృష్ణ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారట. రూలర్ అని కాకుండా క్రాంతి అనే టైటిల్‌ని పరిశీలించాలని దర్శకుడికి చూపించారట.

ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండటంతో క్రాంతి అనే టైటిల్‌నే ఫైనల్ చేయాలని సూచించాడట. దీంతో బాలయ్య చెప్పిన టైటిల్‌ ఫైనల్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ‘టెంపర్’ లో ఎన్టీఆర్ పాత్ర తరహాలో బాలయ్య పాత్ర ఉంటుందని టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరగుతుండగా త్వరలో మిగితా వివరాలు వెల్లడికానున్నాయి.