న్యూ లుక్..ఫ్రెంచ్ గడ్డంతో బాలయ్య

409
balakrishna new look

నందమూరి ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. సరికొత్త లుక్‌లో ఉన్న బాలయ్య గెటప్‌కు సంబంధించిన ఫోటోని హరికృష్ణ కూతురు సుహాసిని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాలా బాబాయ్ కొత్త లుక్ ఆయన వయసుని ఒక 30 ఏళ్ళు తగ్గించింది. ఆయనకి ఆయనే సాటి అని ట్విట్టర్‌లో పేర్కొంది.కొత్త లుక్‌లో బాలయ్యను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 105వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. బాలకృష్ణ సరసన లెజెండ్ భామ సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండగా నమిత ముఖ్యపాత్రలో నటిస్తోంది.

ఈ సినిమాలో బాలకృష్ణను ఢీ కొట్టే విలన్ పాత్రలో జగపతి బాబు యాక్ట్ చేస్తున్నాడు. బాలయ్యతో పాటు జగపతి బాబు కూడా  ద్విపాత్రాభియం చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ‘రూలర్’ అనే టైటిల్ ఖరారు  చేసినట్లు తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి లేదా వేసవి కానుకగా రిలీజ్ చేయనున్నారు.