నవంబర్‌ 1న… జై సింహ ఫస్ట్ లుక్

171
Balakrishna Jai Simha firstlook on november 1st
- Advertisement -

పైసా వసూల్ తర్వాత కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 102 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  ఇప్పటికే యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ సన్నివేశాలతోపాటే… 60 శాతం షూటింగ్ పూర్తైంది.

బాలకృష్ణ 102 వ చిత్రానికి ఆసక్తికర టైటిల్స్ ప్రచారంలోకి వచ్చిన చివరగా జై సింహా అని టైటిల్ ఫిక్స్ చేశారు.   వచ్చే సంక్రాంతి కానుకగా  జనవరి 12న ఆడియెన్స్ ముందుకు రానుంది.   నవంబర్ 1వ తేదీన ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాలయ్య బాబు సరసన ముచ్చటగా మూడోసారి నయనతార జంటగా నటిస్తుండగా కన్నడ బ్యూటీ హరిప్రియ, మళయాళం నటి నతాశా దోషి  ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -