బాలయ్య బోయపాటి మూవీలో హీరోయిన్లు ఎవరో తెలుసా!

174
Balakrsihana Boyapati

బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాను తమన్ సంగీతం అందించనున్నాడు. కాగా ఈమూవీలో హీరోయిన్లపై ఇంత వరకు క్లారిటీ రాలేదు. పలువురి పేర్లు తెరపైకి వచ్చినా వారు నో చెప్పారని తెలుస్తుంది. తాజాగా ఉన్న సమాచారం మేరకు శ్రియ, అంజలిని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

వీరిద్దరు గతంలో బాలకృష్ణతో కలిసి నటించారు. బాలకృష్ణ బోయపాటి సినిమా అంటే పెద్ద ఎత్తున అంచనాలు ఉంటాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహ, లెజెండ్ సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతో మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ చివరగా నటించిన రూలర్ సినిమా భారీ పరాజయాన్ని మూట గట్టుకుంది.