NBK 106.. కవలలుగా బాలయ్య..!

238
balakrishna

నటసింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో మూడో సినిమా రూపొందనున్న సంగ‌తి తెలిసిందే. మార్చి నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. కథానాయికలుగా శ్రియ – అంజలి కనిపించనున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను జగపతిబాబు పోషిస్తున్నారు.

NBK 106

ఇక ఈ చిత్రంలో బాల‌య్య డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నార‌ని.. అందులో ఒక పాత్ర అఘోరాగా క‌నిపించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ మూవీకి సంబంధించి తాజాగా మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ కవల సోదరులుగా కనిపించనున్నాడు. ఒక తల్లి కడుపున జన్మించిన కవలలు ఇద్దరూ, కొన్ని కారణాల వలన విడిపోతారట. అలా ఒకరు రాయలసీమ ప్రాంతంలో పెరిగితే, మరొకరు కాశీలో అఘోరగా మారతాడట. అఘోర పాత్ర ‘విరామం’ తరువాత ఎంట్రీ ఇస్తుందని సమాచారం.