ఎయిర్‌పోర్టులో చిన్నపిల్లాడిలా బాలయ్య..!

306
Balakrishna

ఇటీవలె న్యూ లుక్‌తో అభిమానులను సందడి చేసిన నందమూరి బాలకృష్ణ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. తన 105వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.ఈ నేపథ్యంలో  న్యూజెర్సీ ఎయిర్ పోర్టులో బాలయ్య చేసిన సందడి వైరల్ గా మారింది. చిన్నపిల్లాడిలా  తన లగేజీ(సూట్‌కేసు)తో ఆటలాడుతూ కనిపించగా తీసిన వీడియో  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది మారింది. పలుమార్లు సూట్‌కేసును నెట్టడం,అది తిరిగి వెనక్కి రావడం చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో భాగంగా స్టిన్నింగ్‌ లుక్‌తో సర్‌ప్రైజ్ ఇవ్వగా అది సోషల్ మీడియాలలో వైరల్‌గా మారింది. తన కెరీర్‌లోనే డిఫరెంట్ లుక్‌తో కనిపించి సందడి చేశాడు. బాలయ్య గడ్డం, మీసం చూసి అభిమానులు థ్రిల్‌ అయ్యారు.

ఇటీవల బ్యాంకాక్‌లో తొలి షెడ్యూల్‌ పూర్తయింది. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో తాజా షెడ్యూల్‌ జరుగుతుంది. ప్రకాశ్‌రాజ్‌, భూమిక, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్నారు.