రవిప్రకాశ్‌కు ముందస్తు బెయిల్‌..!

246
TV9 ex-CEO Ravi Prakash
- Advertisement -

ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో అలంద మీడియా సంస్థ ఫిర్యాదుతో రవిప్రకాశ్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. సుమారు రెండు నెలలుగా జర్నలిస్టు – మీడియా వ్యాపారి రవి ప్రకాష్ బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. మూడు కేసుల్లో రవిప్రకాశ్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. వారానికి ఒకసారి పోలీసుల ముందు హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది. అదే విధంగా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి ఎక్కడికి వెళ్లకూడదని రవిప్రకాశ్‌ను ఆదేశించింది.

గతంలో రవిప్రకాశ్‌ తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో.. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే రవిప్రకాశ్‌కు ఉపశమనం కల్పించలేమన్న సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ అంశాన్ని హైకోర్టే తేల్చాల్సి ఉందని..అక్కడికే వెళ్లాలని రవిప్రకాశ్‌కు సూచించింది.

- Advertisement -