బాబు బాగా బిజీ: రివ్యూ

271
Babu Baaga Busy review
- Advertisement -

ఈ వారం బాహుబ‌లి పేరు త‌ప్ప వేరే ఏది వినిపించ‌డం లేదు. మ‌నిషి అన్నాక కూసంత రోమాన్స్ కూడా అవ‌స‌రం అంటున్నారు అవ‌స‌రాల శ్రీ‌నివాస్. త‌ను హీరోగా న‌టిస్తూ చేసిన చిత్రం బాబు బాగా బిజీ . నేడు రిలీజ్ అయింది. హిందీలో విజ‌య‌వంత‌మైన `హంట‌ర్‌` చిత్రాన్ని తెలుగులో `బాబు బాగా బిజీ` పేరుతో రీమేక్ చేశారు. అందులో అవ‌స‌రాల శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌డం అటు ప్రేక్ష‌కుల‌తో పాటు.. ఇటు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ ఆస‌క్తి రేకెత్తింది. మ‌రి సినిమాలో బాబు ఏం చేశాడు? రివ్యూలో చూద్దాం..

కథ:
ప్లేబాయ్‌ టైప్‌లో ఉండే మాదవ్(అవసరాల శ్రీనివాస్‌) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. టీనేజ్‌ వయస్సు నుంచే అమ్మాయిలంటే పిచ్చి. వాళ్లకు ఎలాగైన దగ్గరై వారితో ఎంజాయ్ చేయాలనుకుంటాడు. ఇంతలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో పడతాడు మాదవ్. అయితే పెళ్లి విషయంలో నిజాయితీగా ఉండాలనుకున్న మాదవ్‌.. తాను చూసిన ప్రతీ అమ్మాయికి తన గతం చెబుతుంటాడు. తన గతం తెలియడంతో అమ్మాయిలంతా మాదవ్‌ను ఛీ.. కొడుతారు. దీంతో ఏం చేయాలో తెలియని మాదవ్‌కు.. అతని స్నేహితులు తరువాత వచ్చే అమ్మాయికి అబద్దం చెప్పమంటారు. అలా రాధా (మిస్తీ)కి మాత్రం గతం చెప్పకుండా దగ్గరవుతాడు. ఆమెతో మాధవ్‌కి పెళ్లి నిశ్చయమవుతుంది. మరీ మాధవ్‌ అసలు రూపం రాధకి ఎప్పుడు ఎలా తెలిసింది? రాధ గతమేంటి? వాళ్లిద్దరు పెళ్లి వివాహం చేసుకున్నారా లేదా? మాధవ్‌ జీవితంలోకి వచ్చిన పారు(మదివాడ తేజస్వి).. శోభ(శ్రీముఖి).. చంద్రిక (సుప్రియ) కథలేంటి? అన్న ప్రశ్నలకు సమాధానం చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.

babu

ప్లస్ పాయింట్స్‌:
హిందీ చిత్రం ‘హంటర్‌’ని తెలుగు నేపథ్యానికి.. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కించారు. సాదాసీదా కథే అయినా కథనం కొత్తరకంగా ఉంటుంది. సినిమా ఆరంభం నుంచి సన్నివేశాలన్నీ సరదా సరదాగా సాగిపోతాయి. మాధవ్‌ అనే ప్లేబాయ్‌ పాత్రలో అవసరాల శ్రీనివాస్‌ చక్కగా ఒదిగిపోయాడు. లుక్స్‌ పరంగా ఆయనలో వేరియేషన్స్‌ కనిపించలేదు. ప్రతీ సన్నివేశంలో ఒకేలా కనిపించటమే కొరత. హీరోయిన్లు నలుగురు ఉన్నప్పటికీ మిస్తీకే ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌.. ప్రియదర్శిన్‌ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రధాన బలం. చాలా చోట్ల ఆ సన్నివేశాలు నవ్వులు పండించాయి.

మైనస్ పాయింట్స్‌:
నెమ్మదిగా సాగే కథ.. కుటుంబమంత కలిసి చేసేలా లేకపోవడం ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్.. కథని మరింత ఆసక్తికరంగా.. కామెడీతో తీర్చిదిద్దే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నం జరగలేదు. క్లైమాక్స్‌లో మరింత డ్రామా ఉంటే బాగుండేదన్న భావన కలుగుతుంది. సినిమాను ఇంకా రియలిస్టిక్‌గా తీసిన బాగుండేది.. అనవసర ఎమోషనల్‌ సీన్లు ప్రేక్షకులకు బోరు తెప్పించాయి..

dc-Cover-ik6ut72f7emira8704ckt5t2k1-20170104232529.Medi

హీరో జీవితంలో ఉండే అమ్మాయిల్లో ఏ ఒక్కరినీ కూడా డీటైల్డ్ గా చూపకపోవడం, వాళ్ళతో హీరో రిలేషన్ ఎలా సాగింది అనేది చెప్పకపోవడంతో నిరుత్సాహం కలిగింది. అలాగే కథనం కూడా ఒక ట్రాక్లో నడవకుండా కాసేపు హీరోలోని చెడు, కాసేపు అతనిలోని మంచిని చూపించడంతో వాటిలో ఏ ఒక్కటి కుడా చూసే ప్రేక్షకుడికి బలంగా కనెక్టవ్వలేకపోయాయి. ఇక నెమ్మదిగా, అడాప్ట్ చేసుకోలేని ఎమోషన్ తో సాగే సెకండాఫ్లో హీరో మారడానికి కారణమైన అంశాలని కథతో కనెక్టయ్యే విధంగా చూపలేకపోవడవంతో ముఖ్యమైన ఆ అంశం కూడా సైడ్ ట్రాక్లో నడుస్తున్నట్టు అనిపించి కథనానికి అడ్డుపడుతున్నట్లుగా తోచింది.

సాంకేతిక విభాగం:
రీమేక్‌ సినిమా అనే భావన కలగకుండా ఉండేలా దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దారు. కథను మొదలుపెట్టిన విధానం.. ముగించిన తీరు కొత్తగా అనిపిస్తుంది. మిర్చి కిరణ్‌ మాటలు అలరిస్తాయి. ఛాయగ్రహణం.. సంగీతం కూడా కథకు బలానిచ్చాయి. నిర్మాణ విలువల్లో లోటు లేదు. అడల్ట్ కామెడీ కంటెంట్ నైపథ్యం తీసుకుని తెలుగు నేటివిటీ కోసం మార్పులు చేయాలనే సాకుతో ఎక్కడా ఊహించిన ఎంటర్టైన్మెంట్ ను ఇవ్వలేకపోయాడు దర్శకుడు నవీన్ మేడారం.

తీర్పు:
ఈ రోజుల్లో కొత్తదనానికి అలవాటు పడ్డ తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో బాబు బాగా బిజీ సినిమా విఫలమైంది. ఈ సినిమాలో చెప్పుకోదగినంతా అడల్ట్ కంటెంట్ లేదు.. కావాల్సినంత కామెడీ కూడా లేదు. సాంకేతికంగా సినిమా బాగున్నప్పటికీ సినిమాలో వచ్చే కొన్ని సన్నివేశాలు కుటుంబ సభ్యులంతా కలిసి చూసేందుకు ఇబ్బంది పెట్టేలా ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే బాబు బాగా బిజీ సినిమా కాలక్షేపమే కానీ.. షరతులు వర్తిస్తాయి..

విడుదల తేదీ:05/05/2017
రేటింగ్: 2.5/5
నటీనటులు:మదివాడ తేజస్వి.. శ్రీముఖి.. సుప్రి.. మిస్త్రీ చక్రవర్తి, అవసరాల శ్రీనివాస్‌
నిర్మాత:అభిషేక్ నామా
సంగీతం:సునీల్ కశ్యప్
దర్శకత్వం:నవీన్ మేడారం

- Advertisement -