బీజేపీలోకి రెజ్లర్ బబితా పోగట్‌..!

183
Babita Phogat

భారత రెజ్లర్, అర్జున్ అవార్డు గ్రహీత బబితా పోగట్ బీజేపీలో చేరారు. తండ్రి మహవీర్ సింగ్‌తో కలిసి కేంద్రక్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు.బబితా, మహవీర్‌లకు కాషాయకండువా కప్పిన రిజుజు వారిని బీజేపీలోకి సాదరంగా స్వాగతించారు.ఢిల్లీలోని హర్యానా భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

బీజేపీ చేరిన అనంతరం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిశారు. వారికి నడ్డా కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. బబిత యూత్ ఐకాన్ అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ప్రస్తుతం హర్యానాలో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా అమె పనిచేస్తున్నారు. రాజకీయాల్లో ప్రవేశించిన నేపథ్యంలో ఉద్యోగానికి ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Babita Phogat

గోల్డ్ కోస్ట్‌లో గతంలో జరిగిన 21వ కామన్వెల్త్ క్రీడల్లో బబిత రజత పతకం గెలుచుకోవడంతో ఒక్కసారిగా ఆమె పేరు దేశమంతటా మారుమోగిపోయింది. బీజేపీ సిద్ధాంతాలన్నా, ఆ పార్టీ నేతల విజన్ అన్నా పోగట్‌కు ఎంతో మక్కువని చెబుతారు.

కశ్మీర్ అమ్మాయిలపై చేసిన వ్యాఖ్యలతో ఇటీవల వివాదంలో చిక్కుకున్న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు పోగట్ మద్దతుగా నిలవడం ద్వారా మరోసారి వార్తల్లోకి వచ్చింది. కట్టర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పుపట్టుకునేది ఏముందని ఆమె ప్రశ్నించిన విషయం తెలిసిందే.