ఆడిలైడ్ టెస్టు..పుజారా ఒంటరిపోరాటం

218
pujara
- Advertisement -

ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలిటెస్టులో భారత బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు నిరాశే ఎదురైంది. ఆసీస్ పేస్ బౌలింగ్ ధాటికి భారత బ్యాట్స్‌ మెన్ కుదేలయ్యారు. ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పట్టారు. అయితే మరో ఎండ్‌లో వాల్ పుజారా తన పోరాటం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 127 పరుగులకు భారత్ ఆరు వికెట్లు కొల్పోగా పుజారా 35 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఓపెనర్లు కేఎల్ రాహుల్ (2), మురళీ విజయ్ (11) ,కెప్టెన్ విరాట్ కోహ్లి (3), అజింక్య రహానె (13) నిరాశపరిచారు. రోహిత్ శర్మ (37),రిషబ్ పంత్(25) పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టారు.

తొలి టెస్టు మ్యాచ్‌‌లో రోహిత్ శర్మకి టీమిండియా మేనేజ్‌మెంట్ తుది జట్టులో చోటివ్వడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఈ టెస్టు మ్యాచ్ కోసం బీసీసీఐ నిన్న 12 మందితో కూడిన భారత్ జట్టుని ప్రకటించగా.. ఈరోజు హనుమ విహారిపై వేటు వేసిన టీమిండియా తుది జట్టులో రోహిత్‌కి అవకాశమిచ్చింది. దీంతో టెస్టుల్లో మెరుగైన రికార్డు లేని రోహిత్‌కి ఎలా అవకాశమిస్తారు..? అని సోషల్ మీడియాలో అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.

india vs australia

- Advertisement -