విండీస్‌పై చెమటోడ్చినెగ్గిన ఆసీస్‌

123
westindia vs australia

వరల్డ్ కప్‌లో ఆసీస్ రెండో విక్టరీ నమోదుచేసింది. ఆసీస్ విధించిన 289 పరుగుల లక్ష్య చేదనలో భాగంగా 50 ఓవర్లలో 273 పరుగులు మాత్రమే చేసింది. విండీస్ జట్టు బ్యాట్స్‌మెన్ చక్కని ఫాంలో ఉన్నప్పటికీ చెత్త షాట్లు ఆడి వికెట్లను సమర్పించుకున్నారు. షై హోప్ (105 బంతుల్లో 68 పరుగులు, 7 ఫోర్లు), కెప్టెన్ జానస్ హోల్డర్ (57 బంతుల్లో 51 పరుగులు, 7 ఫోర్లు, 1 సిక్సర్)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చినట్లే వచ్చి ఒకటి రెండు షాట్స్ ఆడి బౌండరీలు సాధించి ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 5 వికెట్లను తీసి విండీస్ పతనాన్ని శాసించాడు. దీంతో విండీస్‌పై ఆసీస్ జట్టు 15 పరుగుల తేడాతో గెలుపొందింది.

అంతకముందు టాస్ గెలిచిన ఆసీస్‌ 49 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది. తొలి మ్యాచ్‌లో అఫ్గాన్‌ను సులువుగా ఓడించిన ఆసీస్‌.. ఈసారి 38 పరుగులకే నాలుగు వికెట్లు చేజార్చుకుంది. ఫించ్‌ (6), వార్నర్‌ (3), ఖవాజా (13), మ్యాక్స్‌వెల్‌ (0) పెవిలియన్‌ చేరారు.

నాథన్‌ కౌల్టర్‌నైల్‌ (92; 60 బంతుల్లో 8×4, 4×6), స్టీవెన్‌ స్మిత్‌ (73; 103 బంతుల్లో 7×4)ల పోరాటంతో ఆసీస్‌ కోలుకుంది. కాట్రెల్‌ (2/56), థామస్‌ (2/63), రసెల్‌ (2/41) వికెట్లు తీశారు.