బాబోయ్..బ్యాంకుల్లో నకిలీ నోట్లు

210
fake notes
- Advertisement -

అక్రమంగా సంపాదించేందుకు దళారులు నకిలీ నోట్లను సరఫరా చేస్తుంటారు. జనాల కళ్లుకప్పి నకిలీ కరెన్సీ ని..మార్కెట్ లోకి వదిలే ప్రయత్నం చేస్తుంటారు. కానీ బ్యాంకుల సాక్షిగా ఏటీఎంల ద్వారా 19 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను పంపిణీ చేశారనే తాజా సమాచారం..దేశంలో సంచలనం రేకెత్తించింది. నకిలీ కరెన్సీ నోట్లను నివారించాల్సిన బ్యాంకులే వాటిని చలామణీ చేసిన బాగోతం బ్యాంకు ఖాతాదారులను నివ్వెరపర్చింది. వివిధ బ్యాంకులు గడచిన మూడున్నరేళ్లలో దేశంలో వివిధ ముఖ విలువలున్న 19 లక్షల నకిలీనోట్లను పంపిణీ చేశాయని రిజర్వుబ్యాంకు నివేదికలో వెల్లడైంది. 19లక్షల నకిలీ నోట్ల విలువ సుమారుగా 144.09 కోట్లను తేల్చిచెప్పారు.

ఈ నకిలీ నోట్లలో రూ.14.97 కోట్లను ఏటీఎంల ద్వారా పంపిణీ చేశారని సాక్షాత్తూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నివేదికలో వెలుగుచూసింది. రూ.54.21కోట్ల వరకు వంద రూపాయల నకిలీ నోట్లుగా..అలాగే రూ.42.8 కోట్లు 500 నకిలీ నోట్లు కాగా.. రూ.47 కోట్లు 1000 నకిలీ నోట్లు పంపిణీ అయినట్టు తెలిపింది. ఈ నకిలీ నోట్లను బ్యాంకులే చలామణి చేశాయని నివేదికలో వెల్లడైంది. ఈ నకిలీ నోట్ల మార్పిడిపై బ్యాంకుల్లో అక్రమాలు జరిగినా.. రిజర్వుబ్యాంకు ఎవరిపై చర్యలు తీసుకోకపోవడం విశేషం.

fake notes

బెంగళూరు నగరంలో రాజు అనే ఎల్ఐసీ ఉద్యోగి రైల్వే స్టేషను సమీపంలోని కెనరా బ్యాంకు ఏటీఎంలో ఐదువేలరూపాయలు డ్రా చేయగా వాటిలో 9 నోట్లు నకిలీవి వచ్చాయి. రాజు బెల్గాంకు రైలు టికెట్ తీసుకొని ఆ నోట్లు ఇవ్వగా అవి నకిలీవని తేలింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒక సారి విత్ డ్రాలో ఐదు నోట్లకంటే ఎక్కువ నకిలీవి వస్తే పోలీసులు తప్పని సరిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏదైనా బ్యాంకు ఏటీఎంలలో డబ్బు పెట్టేముందు వాటిని మెషీన్ సాయంతో అవి అసలువా కాదా అని తనిఖీ చేయాలని రిజర్వుబ్యాంకు నిబంధనలున్నాయి. కాని కొన్ని బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలకు నీళ్లు వదులుతోంది. సిబ్బంది కొరత పేరిట నకిలీ నోట్లను ఏటీఎంల ద్వారా పంపిణీ చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లధనం..నకిలీ కరెన్సీని అరికట్టేందుకు మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని..20 రోజులు గడవక ముందే..అప్పుడే మార్కెట్‌ లో నకిలీ కొత్త నోట్లు పుట్టుకొస్తున్నాయి. బ్యాంకుల్లో రద్దీ ఇంకాస్త ఎక్కువైంది. మరి ఇలాంటి సమయంలో బ్యాంకు అధికారులు ఏమాత్రం అప్రమత్తం లేకున్నా బ్యాంకుల్లో ద్వారా కొత్త నకిలీ నోట్లు వచ్చే అవకాశం ఉంది. నకిలీ నోట్లను నివారించే బ్యాంకులే ఇలా నకిలీ పంపిణీ దారుగా మారితే ప్రజల పరిస్థితి ఏంటీ.ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఆర్బీఐ గట్టి చర్యలు తీసుకోవాలి.

- Advertisement -