మార్చిలో.. ఎటియం వర్కింగ్

11
ATM Working Movie Released On March

డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్, శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్ల ద్వారా కిషోర్ బసిరెడ్డి, యక్కలి రవీంద్రబాబు సంయుక్తంగా పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘’ ఎటియం వర్కింగ్’’ . సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా మార్చి 10న విడుదలకు సిద్దమైంది.

పెద్దనోట్ల రద్దు నేపధ్యంలొ అవినీతి రాజకీయనాయకుల ద్వంద నీతిని ఎండగడుతూ సునిశిత హాస్యంతో , ఎటియం క్యూలైన్ లో పుట్టిన ఒక ప్రేమ కథను వినోదాత్మకంగా దర్శకుడు తెరకెక్కించాడని, ప్రవీణ్ ఇమ్మడి సంగీత సారధ్యంలో మూడు పాటలు చక్కగా కుదిరాయని నిర్మాతలు ఒక ప్రకటనలో తెలిపారు.

 ATM Working Movie Released On March

నవంబర్8 నుండి డిసెంబర్ 31 వరకు జరిగిన సంఘటనలను, సన్నివేశాలను, డబ్బులు అందుబాటులో లేక, చిల్లర దొరక్క సామన్య ప్రజలు పడ్డ ఇక్కట్లను ఇబ్బందులను ఒక చక్కని ప్రేమ కథగా మలిచి ఆ అనుభవాలని ప్రేక్షకులకు మరోసారి స్పురణకు తెచ్చే ప్రయత్నం ఈ చిత్రమని, ఆద్యంత వినోదాన్ని అందిస్తూ ఆలోచింప చేసే ఒక ప్రయోగాత్మకమైన చిత్రమని ఇందులో పక్కదేశం ముష్కరులు, దేశవాళీ నాయకులు, దొంగనోట్ల ముద్రణను కుటీర పరిశ్రమగా చేసుకుని పనిచేసే నిరుద్యోగ యువకులు వినోదాన్ని పండిస్తారని దర్శకుడు తెలియ చేసారు.

పవన్, కారుణ్య ప్రేమజంటగా, రాకేష్, మహేంద్ర, నారాయణ, మహేష్, అంబటి శ్రీను, కిషోర్ దాస్, రాంబాబు,వీరభద్రం, ఆంజనేయులు, తిరుపతి దొర తదితరులు ప్రధాన తారాగణం.

సంగీతం : ప్రవీణ్ ఇమ్మడి, పాటలు : వీరేంద్ర, వాసవి రెడ్డి, కెమెరా: శివరాం, ఎడిటింగ్: శ్యాముల్ కళ్యాణ్, సహ నిర్మాతలు : కుర్రా విజయకుమార్, రాజా.జి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : బి. బాపిరాజు, పి.యల్.కే రెడ్డి, నిర్మాతలు : కిషోర్ బసిరెడ్డి, యక్కలి రవీంద్రబాబు, రచన, దర్శకత్వం: పి. సునీల్ కుమార్ రెడ్డి.