సీఎం కేసీఆర్ చేసిన యాగంతో రాష్ట్రం సుభిక్షంగా ఉంది

528
athirudrayagam
- Advertisement -

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని హయాగ్రీవాచారి మైదానంలో నేడు అతిరుద్రయాగం ప్రారంభమైంది. ఈనెల 15 నుంచి 21 వరకు శృంగేరి పీఠం ఆధ్వర్యంలో ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. 200 మంది వేద పండితులతో ఈ యాగంలో పాల్గొననున్నారు. ఈ యాగానికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ హాజరయ్యారు. యాగ నిర్వాహకులు, కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులు తాటిపల్లి శ్రీనివాస్-రోజారాణి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వారిని ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆశీర్వదించారు.

ఈసందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేసిన యాగంతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. సమృద్ధిగా వర్షాలు పడి .. కుంటలు, చెరువులు వాగులు నిండాయన్నారు. సీఎం కేసీఆర్ స్పూర్తితో ఇలాంటి యాగాలు జరగడం లోకలకళ్యాణానికి దోహదపడతాయి. మేడారం జాతరకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వడం లేదు. మేడారం పనులు చురుగ్గా సాగుతున్నాయి. రెండు జాతరాలు నిర్వహించిన స్పూర్తితో ఈ మేడారం జాతర కూడా వైభవంగా నిర్వహిస్తాం అన్నారు.

- Advertisement -