కాశీలో ఆరవ రోజు అతిరుద్ర యాగం

674
Athirudrayagam
- Advertisement -

ఆరోవ రోజు న అతిరుద్ర యాగంలో భాగంగా ఈరోజు చండీ హోమం అమ్మవారి దుర్గా దేవి మూల మంత్రం తో చండీ యాగాన్ని వేద రుత్వికులు చేసి అనంతరం అతిరుద్ర యాగానికి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పూర్ణాహుతి ని సమర్పించారు

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ భక్తులనుద్దేశించి మాట్లడుతూ… కార్తీక మాసం అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ను కలిగినది అని మన వేదాలు, పురాణాలు చెప్పుతున్నాయని శివునికి, విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున ఈ మాసం ఏ దైవ కార్యలు చేసినా మానవాళికి వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్త్యం కలిగినది అని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు భక్తులనుద్దేశించి మాట్లాడారు.

అనంతరం శ్రీ సచ్చిదానంద స్వామీజీ గంగానదీ తీరానికి వెళ్లి గంగానదికి పట్టుచీర సారె ని సమర్పించి దేశమంతా సుభిక్షంగా ఉండాలని అకాల వర్షాలు వరదలు లేకుండా చక్కటి పాడిపంటలతో ప్రపంచ అంతా శాంతి తో అందరు సుఖంగా సంతోషాలతో ఉండేలాగ దీవించమని గంగమ్మ తల్లిని ప్రార్థించి పూజలు చేసారు.

- Advertisement -