అశ్విన్ ధాటికి కీవిస్ విలవిల..

203
- Advertisement -

మ‌రో క్లీన్‌స్వీప్ ఖాయంగా క‌నిపిస్తోంది. న‌్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్‌కు భారీ ఆధిక్యం ల‌భించింది. అశ్విన్ ధాటికి కీవిస్ విలవిలలాడింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ టీమ్ 299 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 258 ప‌రుగులు భారీ ఆధిక్యం ద‌క్కింది. గుప్తిల్(72), రోంచి(71) పరుగులతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో హయ్యెస్ట్ స్కోరర్లుగా నిలిచారు. అశ్విన్ ఆరు వికెట్లు తీయ‌డంతోపాటు త‌న బౌలింగ్‌లోనే ఇద్ద‌రిని ర‌నౌట్ చేశాడు. ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయ‌డం అశ్విన్‌కిది 20వ సారి కావ‌డం విశేషం. మ‌రో స్పిన్న‌ర్ జ‌డేజా రెండు వికెట్లు తీశాడు.

india

కివీస్‌ను ఫాలోఆన్ ఆడించ‌కుండా రెండో ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన భార‌త్‌.. ఆట ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్ట‌పోకుండా 18 ప‌రుగులు చేసింది. అయితే ఫీల్డింగ్ చేస్తూ గాయ‌ప‌డిన గంభీర్‌.. ఓపెనింగ్‌కు దిగినా మ‌ధ్యలోనే రిటైర్డ్ హ‌ర్ట్‌గా వెళ్లిపోయాడు. ప్ర‌స్తుతం విజ‌య్ 11, పుజారా 1 ప‌రుగుతో క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం కోహ్లిసేన ఓవ‌రాల్‌గా 276 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. మ‌రో రెండు రోజుల ఆట మిగిలి ఉండ‌టంతో భార‌త్ విజ‌యం దాదాపు ఖాయంగానే క‌నిపిస్తోంది.

india vs newzealnad

ఇండియా: 557/5 డిక్లేర్డ్

తొలి ఇన్నింగ్స్ హయ్యెస్ట్ స్కోరర్లు: కోహ్లీ – 288, రహానే – 188, శర్మ – 51

న్యూజిలాండ్: 299 ఆలౌట్

తొలి ఇన్నింగ్స్ హయ్యెస్ట్ స్కోరర్లు: గుప్టిల్ – 72, రోంచి – 71

భారత్ బౌలింగ్: అశ్విన్- 6/81, జడేజా – 2/80

- Advertisement -