‘అశ్వ‌మేథం’ విడుదలకు సిద్ధం..!

430
Ashwamedham
- Advertisement -

ధృవ క‌రుణాక‌ర్ హీరోగా న‌టించిన చిత్రం `అశ్వ‌మేథం`. ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 9న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సైబ‌ర్ క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి నితిన్‌.జి ద‌ర్శ‌కుడు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సోన్యా, శివంగి కేద్‌క‌ర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

aswamedham

ఈ చిత్రానికి చ‌ర‌ణ్ అర్జున్ సంగీతం అందించగా.. జైపాల్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఎలో క్వెన్స్ మీడియా ప్రై.లి, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ ప‌తాకాల‌పై సినిమాను ప్రియా నాయ‌ర్‌, వంద‌న యాద‌వ్‌, ఐశ్వ‌ర్య యాద‌వ్‌, రూపేశ్‌, శుభ్ మ‌ల్హోత్రా నిర్మించారు. న‌టీన‌టులు:ధృవ క‌రుణాక‌ర్‌, ప్రియ‌ద‌ర్శి,వెన్నెల‌కిశోర్‌,సుమన్‌,సోన్యా,శివంగి,అంబటి అర్జున్ తదితరులు.

- Advertisement -