బిగ్ బాస్ 3.. అషు రెడ్డి ఎలిమినెట్

284
Ashu-Reddy-Bigg-Boss-3-

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 3 ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. మొదటి రెండు సీజన్ల కన్నా మూడవ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈషో రేటింగ్స్ లో టాప్ ప్లేస్ లో ఉంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వగా ఇప్పటి వరకు నలుగురు సభ్యులు ఎలిమినెట్ అయ్యారు. అందులో మొదటి వారం హేమ ఎలిమినెట్ అవ్వగా, రెండవ వారం జాఫర్, మూడవ వారం తమన్నా, నాల్గవ వారం రోహిణిలు ఎలిమినెట్ అయ్యారు.

ashu-house-jpg_

ఇక ఈవారం కూడా ఒకరు ఇంటినుంచి బయటకు రానున్నారు. ఈవారం ఎలిమినేషన్ లో మొత్తం 7గురు సభ్యులు ఉన్నారు. హిమజ, పునర్ణవి, అషురెడ్డి, బాబా భాస్కర్, రాహుల్, శివజ్యోతి, మహేశ్ లు ఎలిమినేషన్ లో ఉన్నారు. వీరిలో నుంచి ఎవరో ఒకరు ఇవాళ జరిగే ఎపిసోడ్ లో హౌజ్ నుంచి బయటకు రానున్నారు. అయితే వీరిలో అందరికన్నా ఎక్కువ ఓట్లు బాబా భాస్కర్ కు వచ్చినట్లు తెలుస్తుంది.

అయితే అందరి కంటే తక్కువ ఓట్లు అషు రెడ్డికి వచ్చినట్లు సమాచారం. ఈ వారం అషురెడ్డి ఇంటి నుంచి బయటకు రానుందని తెలుస్తుంది. అషు రెడ్డి ఎక్కువగా టాస్క్ లలో పార్టిసిపెట్ చేయడం లేదని అందుకే ఆమెకు అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చాయని బిగ్ బాస్ అభిమానులు అనుకుంటున్నారు. అషు రెడ్డి ఎలిమినేషన్ కు సంబంధించి అఫిషియల్ గా తెలియాలంటే రేపటి ఆదివారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.