కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా అశోక్ గెహ్లాత్..ఖరారు చేసిన సోనియాగాంధీ

394
gehlot-rahul
- Advertisement -

ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరా పరాభవాన్ని ఎదురుచూసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కేవలం 54స్ధానాల్లో విజయం సాధించింది. మోదీ హవా ముందు రాహుల్ గాంధీ ఘోరంగా ఢీలా పడిపోయారని చెప్పుకోవాలి. భారీ మెజార్టీతో మరోసారి మోదీని ప్రధానిని చేశారు దేశ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ఓటమిని నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు రాహుల్ గాంధీ.

కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాత్ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. సోనియా గాంధీ, అహ్మద్‌ పటేల్, ఆజాద్, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్‌ ల బృందం కొత్త అధ్యక్షుడి కోసం వెదుకులాడి గెహ్లాత్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ లో కుటుంబ పాలన నడుస్తోందని విపక్షాలు చేస్తున్న ప్రచారానికి చెక్ చెప్పవచ్చని కూడా వారు యోచిస్తున్నట్టు సమాచారం.

ఇక అశోక్ గెహ్లాత్ రాజస్ధాన్ కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన మూడవ సారి రాజస్ధాన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అశోక్ గెహ్లాత్ ను జాతీయ అధ్యక్షుడిని చేసి రాజస్ధాన సీఎంగా యువనాయకుడు సచిన్ పైలెట్ ను చేయనున్నారని తెలుస్తుంది.

- Advertisement -