మ‌హేష్‌ మేనల్లుడి డెబ్యూ మూవీ లాంచ్..

524
mahesh
- Advertisement -

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ బావ‌, గుంటూరు పార్ల‌మెంట్ స‌భ్యుడు జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. `భ‌లే మంచి రోజు`, `శ‌మంత‌క మ‌ణి`, `దేవ‌దాస్` చిత్రాల‌తో ప్రేక్ష‌కుల, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే కాదు.. క‌మ‌ర్షియ‌ల్ విజ‌యాల‌ను ద‌క్కించుకున్న యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రామానాయుడు స్టూడియోలో న‌వంబ‌ర్ 10న గ్రాండ్ లెవ‌ల్లో జ‌ర‌గ‌నున్న ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌రవుతున్నారు. త‌న‌దైన స్టైల్లో డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండ‌గా రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

ashok

న‌టీన‌టులు: అశోక్ గ‌ల్లా, న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య త‌దిత‌రులు.. సాంకేతిక నిపుణులు:క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీరామ్ ఆదిత్య‌.టి, నిర్మాత‌: ప‌ద్మావ‌తి గ‌ల్లా, బ్యాన‌ర్‌: అమ‌ర్ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: చంద్ర‌శేఖ‌ర్ రావిపాటి, మ్యూజిక్‌: జిబ్రాన్‌, సినిమాటోగ్ర‌ఫీ: రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌, ఆర్ట్‌: రామాంజ‌నేయులు, ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి, డైలాగ్స్‌: క‌ల్యాణ్ శంక‌ర్‌, ఎ.ఆర్‌.ఠాగూర్‌,కాస్ట్యూమ్స్‌: అక్ష‌య్ త్యాగి, రాజేష్‌,పి.ఆర్‌.ఒ: బి.ఎ.రాజు, వంశీ శేఖ‌ర్‌.

- Advertisement -