ధోనిపై ఆగ్రహం..పశ్చాతాపం వ్యక్తంచేసిన నెహ్రా!

288
dhoni
- Advertisement -

టీమిండిమా సక్సెస్ ఫుల్ కెప్టెన్‌లలో ఒకరు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్‌ ధోని. భారత్‌కు టీ20,వన్డే ప్రపంచకప్ అందించిన మహీ ప్రస్తుతం గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్నాడు. జట్టులో చోటుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు ధోని.

కెరీర్ తొలినాళ్లలో కూడా ధోనిది ఇదే పరిస్ధితి. దీంతో పలు అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. స్టార్ బౌలర్‌ ఆశిష్ నెహ్రా కూడా ఓ సందర్భంలో ధోనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని క్యాచ్‌ మిస్ చేయడంతో నెహ్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కూడా అయింది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రవర్తన పట్ల పశ్చాతాపం వ్యక్తం చేశాడు. చాలా మంది ఆ వీడియో విశాఖపట్నం మ్యాచ్‌ది అనుకుంటారు. కానీ అహ్మదాబాద్‌లో నాలుగో వన్డే అది. పాక్‌తో మ్యాచ్‌ అనగానే ఉండే ఒత్తిడికి తోడు అఫ్రీది అప్పటికే సిక్సర్‌ బాదాడు. ఆ తర్వాత బంతికే వచ్చిన అవకాశాన్ని మిస్‌ చేయడం కోపాన్ని తెప్పించింది. ఆరోజు నేను అలా చేయడం తప్పే. మ్యాచ్‌ తర్వాత ధోనీ, ద్రావిడ్‌ నాతో బాగానే ఉన్నారు అని నెహ్రా తెలిపాడు.

తన 22 ఏళ్ల క్రికెట్‌ ప్రయాణంలో సౌరవ్‌ గంగూలీ, ఎంఎస్‌ ధోనిలు నాకు నచ్చిన, అత్యుత్తమ సారథులు. వారికి ఏం చేయాలో తెలుసు, సహచర క్రికెటర్ల నుంచి అత్యుత్తమ ఆటను ఎలా రాబట్టాలో తెలుసు. ధోనిని చూసినప్పుడల్లా ఆత్మ విశ్వాసం ఉన్న వ్యక్తికి అవకాశం లభించి సద్వినియోగం చేసుకున్నాక అతడిని వెనక్కి లాగడం కష్టం అనే సత్యం రుజువైంది అని నెహ్రా పేర్కొన్నాడు.

- Advertisement -