హైదరాబాద్‌కు అమిత్‌ షా..అసద్‌ సంచలన వ్యాఖ్యలు

425
asaduddin owaisi
- Advertisement -

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో మజ్లిస్ చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.హిందూత్వ పేరుతో సీఎం కేసీఆర్‌ని ఓడించలేరని అన్నారు.

టీఆర్ఎస్‌ను ఓడించాలనే బీజీపీ కల ఎప్పటికి నెరవేరదన్నారు. మోడీ కంటే కేసీఆరే దృఢమైన భారతీయుడని తెలిపారు. తాము హిందూయిజానికి వ్యతిరేకం కాదని, కేవలం హిందూత్వ విధానాలను వ్యతిరేకిస్తామని అసద్ స్పష్టం చేశారు.

మోడీ రెండు దేవాలయాలను సందర్శిస్తే, కేసీఆర్ ఆరు దేవాలయాలను సందర్శిస్తారని అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆ పార్టీ నేతల కలలు కల్లగానే మిగిలిపోతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -