ఎన్నికల ప్రచారం…డ్యాన్స్ చేసిన అసదుద్దీన్

468
asaduddin
- Advertisement -

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ డ్యాన్స్ చేశారు. ఎప్పుడు తన పదునైన మాటలతో ప్రత్యర్థులను ఇబ్బందులకు గురిచేసే అసద్‌…ఔరంగాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని సెకన్ల పాటు డ్యాన్స్ చేసి అందరికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఓ వేదిక‌పై మాట్లాడిన త‌ర్వాత.. అక్క‌డ నుంచి వెనుదిరుగుతున్న స‌మ‌యంలో స్టేజ్ మెట్ల‌పై ఓవైసీ కొన్ని స్టెప్పులేశారు.

మ‌హారాష్ట్ర‌లోని 288 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను, ఎంఐఎం పార్టీ 44 స్థానాల్లో పోటీ చేస్తున్నది. ముఖ్యంగా ఔరంగాబాద్ జిల్లాలో బీజేపీకి మ‌జ్లీస్ గట్టి స‌వాల్ విసురుతోంది. ఇక్కడ గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనే ఎంఐఎం ఔరంగాబాద్ ఎంపీ సీటు గెలుచుకుంది.

- Advertisement -