ఈ నెల 21న ‘గ‌జేంద్రుడు’ వ‌స్తున్నాడు..

22
Arya's Gajendrudu

ఎప్ప‌టిక‌ప్పుడు విభిన్న‌మైన పాత్ర‌లు ఎంచుకుంటూ న‌టుడుగా త‌న సత్తా ఏంటో ప్రూవ్ చేసుకుంటూ ఆడియ‌న్స్‌ను ఆక‌ట్టుకుంటోన్న హీరో ఆర్య‌. తాజగా ఆర్య హీరోగా భారీ బడ్జెట్‌తో విభిన్న‌మైన చిత్రం `క‌దంబ‌న్`లో న‌టించాడు. హీరోయిన్‌గా కేథ‌రిన్ థెరిస్సా న‌టించింది. రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం త‌మిళంలో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించి ఆర్య కెరీర్ లోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర ఫ్రేమ్స్ ప‌తాకంపై భార‌తి వరప్రసాద్ వ‌డ్డెల్ల స‌మ‌ర్ప‌ణ‌లో ఉద‌య్ హ‌ర్ష వ‌డ్డెల్ల నిర్మాత‌గా `గ‌జేంద్రుడు` పేరుతో తెలుగులోకి అనువ‌దిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 21న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

Arya's Gajendrudu

ఈ సంద‌ర్బంగా నిర్మాత ఉద‌య్ హ‌ర్ష వ‌డ్డెల్ల మాట్లాడుతూ…“ హీరో ఆర్య అంటే తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండ‌డు. హీరోగా, విల‌న్‌గా త‌ను తెలుగులో అద్భుమైన సినిమాలు చేశారు. అలాగే అందాల తార కేథ‌రిన్, ఆర్య స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించింది. వీరిద్ద‌రి జంట తెర‌పై క‌నువిందు చేస్తుంది. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించి.. క్రిటిక్స్ నుంచి మంచి ప్ర‌శంస‌లు అందుకున్న చిత్ర‌మిది. ఓ కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజన పుత్రులుగా హీరో హీరోయిన్స్ న‌టించారు.

సినిమా అంతా కూడా కొండ ప్రాంతంలో ఉంటూ ఆద్యంతం థ్రిల్‌కి గురి చేసేలా ఉంటుంది. ఆర్య ఈ సినిమా కోసం వెయిట్ పెర‌గ‌డ‌మే కాకుండా షూటింగ్ స‌మ‌యంలో ఆ కొండ‌ల్లో ఎంతో శ్ర‌మించి షూటింగ్ చేశారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాకు మ‌రో హైలెట్‌గా యువ‌న్ శంక‌ర్ రాజా మ్యూజిక్ ఉంటుంది. ఈ నెల 21న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.