ఎన్డీయేకు శివసేన గుడ్‌బై..

436
shiv sena
- Advertisement -

మహారాష్ట్రలో రాజకీయాలు సరికొత్త మలుపును తీసుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు శరవేగంగా పావులు కదుపుతోంది శివసేన. ఎన్సీపీ విధించిన షరతు మేరకు ఎన్డీయే నుంచి బయటకొచ్చింది శివసేన. శివసేన ఎంపీ,కేంద్ర పరిశ్రమల శాఖమంత్రి అరవింద్ సావంత్ తన పదవికి రాజీనామా చేశారు.

తామెందుకు ఇంకా ఢిల్లీలో ఉండాలి…. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి మోడీ ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నా అని తెలిపారు. దీంతో ముంబైతో పాటు ఢిల్లీ రాజకీయాలు సైతం ఒక్కసారిగా వేడెక్కాయి.

శివసేన–ఎన్సీపీ సంకీర్ణానికి కాంగ్రెస్‌ మద్దతిచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్సీపీ చీఫ్‌ పవార్‌ మంగళవారం తమ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం సోనియాతో సమావేశం కానున్నారు. ఆమెతో భేటీ అనంతరమే తమ నిర్ణయం తెలుపుతామని పవార్‌ ప్రకటించారు. దీంతో అందరీ కళ్లు కాంగ్రెస్‌ వైపు మళ్లాయి.

- Advertisement -