మంత్రి పదవి వద్దు:మోడీకి జైట్లీ లేఖ

115

రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. రేపు నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనుండగా ఆయనతో పాటు ఎంతమంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇక అంతా ఉహించినట్లుగానే ఈ సారి మోడీ కేబినెట్‌ నుంచి జైట్లీ తప్పుకున్నారు. తనకు మంత్రివర్గంలో చోటు కల్పించవద్దని జైట్లీ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖరాశారు. అనారోగ్య కారణాల చేత కేబినెట్‌లో చేరలేనని లేఖలో వెల్లడించారు.

ఇటీవల ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశానికి జైట్లీ గైర్హాజ‌ర‌య్యారు. అనారోగ్యం కార‌ణంగా కేబినెట్ మీటింగ్‌కు హాజ‌రుకాలేద‌ని స‌మావేశానంత‌రం బీజేపీ వ‌ర్గాలు తెలిపాయి. బీజేపీ విజ‌యోత్స‌వ కార్య‌క్ర‌మాలకు కూడా ఆయన దూరంగానే ఉన్నారు.

జైట్లీ అమెరికాలో చికిత్స నిమిత్తం వెళ్లిన‌ప్పుడు పియూశ్ గోయ‌ల్ తాత్కాలిక ఆర్థిక మంత్రిగా కొన‌సాగిన విషయ తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కొత్త కేబినెట్‌లో పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిత్వ‌ శాఖ‌ను గోయ‌ల్‌కు కేటాయించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

arun jaitly