వర్మాను అరెస్ట్‌ చెయ్యండి..

205
Arrest Verma ...vijayavada court order
- Advertisement -

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు విజయవాడ న్యాయస్థానం షాకిచ్చింది. వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి వర్మాను అరెస్ట్‌ చెయ్యాలని ఆదేశించింది. అయితే వర్మాను అరెస్ట్‌ చెయ్యాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడానికి కారణం ‘వంగవీటి’ సినిమా. అసలు విషయాకికొస్తే… వర్మ దర్శకత్వంలో కిరణ్ కుమార్ నిర్మాతగా ‘వంగవీటి’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

Arrest Verma ...vijayavada court order

ఈ సినిమా నిర్మాణ సమయంలో తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని వంగవీటి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఆ సమయంలో వర్మ తాను తీయదలచుకున్న సినిమాపై వారికి వివరణ కూడా ఇచ్చారు.

అయితే, వర్మ తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా, వాస్తవాలను వక్రీకరించి, ‘వంగవీటి’ సినిమాను తీసి, తమ కుటుంబాన్ని అవమానపరిచారని రంగా తనయుడు రాధా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Ram Gopal Varma Reply to Anupama Chopra

దీనిని విచారించిన న్యాయస్థానం తాజాగా వర్మ, కిరణ్ కుమార్ ల అరెస్టుకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి వర్మ అరెస్టుకు ఆదేశాల నేపథ్యంలో.. ఈ వివాదం ఇంకా ఎక్కడి వరకూ వెళ్తుందో చూడాలి.

- Advertisement -