మహేశ్ తో తప్పకుండా సినిమా చేస్తాః సందీప్ రెడ్డి వంగా

81
Sandeep Reddy Vanga Mahesh Babu

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుంది. రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటించనున్నారు. 2020సంక్రాంతికి ఈసినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. ఇక మహేశ్ బాబు తరువాతి మూవీ ఏవరితో చేస్తాడన్న విషయం ఇంకా ప్రకటించలేదు.

మహేశ్ మాత్రం యువ దర్శకులకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నాడట. ఈసందర్భంగా మహేశ్ కోసం ప్రస్తుతం ఇద్దరు యువ దర్శకులు లైన్ లో ఉన్నారట. గీత గోవిందం సినిమాతో హిట్ కొట్టిన పరశురామ్ మరోకరు అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ను షేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

   తాజాగా ఓ ఇంటర్యూలో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ మహేశ్ తో సినిమా తప్పకుండా తీస్తానని చెప్పాడు. ప్రస్తుతం దానిపైనే వర్క్ చేస్తున్నట్లు కూడా తెలిపాడు. సందీప్ రెడ్డి బాలీవుడ్ లో దర్శకత్వం వహించిన కబీర్ సింగ్ భారీ వసూళ్లను రాబడుతోంది.