‘అరవింద సమేత’ ట్రైలర్‌..

272
Aravindha Sametha
- Advertisement -

త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే కథానాయిక. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. తమన్‌ బాణీలు అందిస్తున్నారు. అక్టోబరు 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్‌ రాయలసీమ కుర్రాడిగా సందడి చేయబోతున్నారు. ఎన్టీఆర్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ తాజాగా విడుదల చేశారు చిత్ర బృందం.

Aravindha Sametha

ఈ రోజు హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో ఈ ట్రైలర్‌ని నందమూరి కల్యాణ్ రామ్ విడుదల చేశారు. ఈ వేడుకలో కల్యాణ్ రామ్, దర్శకుడు త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ, నటీనటులు జగపతిబాబు, సితార, సునీల్, పాటల రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -