తలైవి బయోపిక్‌:ఎమ్జీఆర్‌ ఎవరో గుర్తుపట్టారా..?

488
aravind swamy
- Advertisement -

తమిళనాడు మాజీ మఖ్యమంత్రి,దివంగత జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎమ్జీఆర్ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

ఎంజీ రామచంద్రన్‌ 103వ జయంతి సందర్భంగా ఎమ్జీఆర్‌ పాత్రను రివీల్ చేశారు. ఈ పాత్రను విలక్షణ నటుడు అరవింద్‌ స్వామి పోషిస్తున్నారు. ఎంజీఆర్ లుక్ అదిరిపోగా తమిళ సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన ఎమ్జీఆర్‌కు ఇది సరైన నివాళి అంటోంది చిత్రయూనిట్‌.

ఈ సందర్భంగా దర్శకుడు విజయ్‌ మాట్లాడుతూ.. తలైవి సినిమాకు దర్శకత్వం వహించడం తనకు అదృష్టమన్నారు. ఇక జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తుండగా విష్ణు వర్ధన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌తో కలిసి విబ్రీ మోషన్‌ పిక్చర్స్‌, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకాలపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూన్‌ 26న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -