శరద్‌ పవార్‌తో భేటీకానున్న శివసేన ఎంపీ..!

310
sharad power

కేంద్ర కేబినెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది శివసేన. కేంద్రమంత్రివర్గంలో కొనసాగతున్న అరవింద్ తన పదవీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. తన రాజీనామా అనంతరం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను కలవనున్నారు.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తమకు మరింత సమయం కావాలని గవర్నర్‌ని కోరారు శివసేన పార్టీ. ఇవాళ సాయంత్రం 7:30 కల్లా శివసేన పార్టీ తన నిర్ణయాన్ని తెలియ చేయాలని మహారాష్ట్ర గవర్నర్ కోరారు.

మహారాష్ట్రలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశం అయ్యారు. సోనియా గాంధీ నివాసంలో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో అహ్మద్ పటేల్, కెసి వేణుగోపాల్, మల్లికార్జున్ ఖార్గే హాజరయ్యారు. ఎన్సీపీ, శివసేన పార్టీలు కలిసి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా లేదా? లేక ప్రభుత్వంలో భాగస్వామి కావాలా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకొనున్నారు.