అపోలో ఆసుపత్రిలో ఈఎంఐ హెల్త్ కార్డు

238
Health-Care

అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే వారికి సరికొత్త వెసులు బాటు కల్పించింది యాజమాన్యం. ఆసుపత్రి బిల్లు ఇకేసారి కట్టడం ఇబ్బందిగా ఉన్నవారికోసం ఈఎంఐ హెల్త్‌కార్డును ప్రవేశపెట్టింది. బజాజ్ ఫిన్ సర్వ్ తో కలిసి ఈ కార్డును తీసుకువచ్చినట్లు తెలిపారు అపోలో యాజమాన్యం. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినప్పుడు ఛార్జీల చెల్లింపు విషయంలో ఇబ్బందిపడకుండా ఈ కార్డు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్డు ఉన్న రోగులు తమ వైద్యసేవల ఖర్చులను పన్నెండు వాయిదాల్లో చెల్లించవచ్చని తెలిపారు. ఈ కార్డు తీసుకోవడం చాలా ఈజి పద్దతి అని చెప్పారు. ఇన్సూరెన్స్ లేనివాళ్లు, తక్కువ బీమా సదుపాయం ఉన్నవారికి ఇది ఉపయోగకారిగా ఉంటుందిని అపోలో యాజమాన్యం స్పష్టం చేసింది.

ఎమెర్జెన్సీ మెడికల్ అవసరాలకు డబ్బులు లేక పేద, దిగువ మధ్యతరగతి కుటంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని..వారికోసమే ఈ వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. ఈ అపోలో ఈఎంఐ హెల్త్‌కార్డులు కావాల్సిన వారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని బజాబ్ ఫిన్‌సర్వ్ పేర్కొంది. కాగా ఈ కార్డును ఇండియాలోని ఏ అపోలో ఆసుపత్రిలోనైనా వాడుకోవచ్చని సూచించారు. ఈకార్డు వివరాల కోసం అపోలో ఆసుపత్రితో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆసుపత్రి యాజమాన్యం.