ఏపీ మంత్రుల జాబితా ఇదే.. స్పీకర్ గా రోజా?

545
Jagan Roja
- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఇక మంత్రి పదవులపై ఆయన తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకూ పలుమార్లు మార్పులు చేర్పులు చేసిన జగన్ మరో రెండు రోజుల్లో మంత్రి వర్గాన్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈనెల 8న తొలిదశలో 15మందితో ప్రమాణస్వీకారం చేయించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. సామాజిక సమీకరణాలు, ప్రాంతాల వారి సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని మంత్రవర్గ కూర్పు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇందులో కొంత మందికి బెర్త్ లు ఖారారైనట్లు తెలుస్తుంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇద్దరిని, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒక్కరిని తీసుకోనున్నట్లు సమాచారం. ఇక కాపు కోటాలో మరో ఇద్దరికి అవకాశం కల్పించాలని చూస్తున్నారు.

హోం మంత్రిత్వ శాఖను ఆయనకు దగ్గరగా ఉండే వ్యక్తులకు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మరో వైపు ఈశాఖ బడుగు వర్గాల నేతలకు ఇస్తే ఎలా ఉంటుందన్నా దానిపై ఆయన సమాలోచనలు చేస్తున్నారట. ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి హోం మంత్రి పదవి ఇస్తే దళిత వర్గాలకు న్యాయం చేసిన వాళ్లం అవుతామని భావిస్తున్నారట. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి చాలా మంది ఉండటంతో ఎంపిక కొంచెం కష్టతరం అవుతున్నట్లు తెలుస్తుంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రోజాకు మంత్రి పదవి ఇవ్వడం కష్టమేనని చెప్పుకోవచ్చు..

అందుకే ఆమెకు అసెంబ్లీ స్పీకర్ గా అవకాశం ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక మంత్రి పదవులు ఖరారైన వారిలో..వైసిపి సీనియర్ నేత బొత్స సత్యానారాయణ, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, ధర్మాన ప్రసాద్ రావు, మహిందర్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్లు ఖరారైనట్లు తెలుస్తుంది. ఇక మహిళల కోటాలో ఇద్దరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అందులో పాలకొండ ఎమ్మెల్యే కళావతికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మేకపాటి సుచరిత, తానేటి వనిత పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.

- Advertisement -